బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కోసం జైషా ప్రయత్నాలు! 9 d ago
బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తుంది. ఇటీవలే చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జైషా, ఆ దిశగా ఒలింపిక్స్ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ‘బ్రిస్బేన్ (2032) ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ సిండీ హుక్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లేతో భేటీ జరగాగా, విశ్వక్రీడల్లో క్రికెట్‌ను భాగం చేసేందుకు చర్చించాం’ అని ట్వీట్ చేశాడు. 128 ఏండ్ల తర్వాత 2028 లాస్‌ఎంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.